Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఅభిమన్యు, రాహుల్‌అర్ధ సెంచరీలు

అభిమన్యు, రాహుల్‌అర్ధ సెంచరీలు

- Advertisement -

– 184 పరుగుల ఆధిక్యంలో భారత్‌-ఏ
– ఇంగ్లాండ్‌ లయన్స్‌తో రెండో అనధికార టెస్టు
నార్తాంప్టన్‌ (ఇంగ్లాండ్‌) :
ఇంగ్లాండ్‌ పర్యటనను సెంచరీతో ఘనంగా మొదలెట్టిన కెఎల్‌ రాహుల్‌.. మరో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (80, 92 బంతుల్లో 10 ఫోర్లు), కెఎల్‌ రాహుల్‌ (51, 64 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించగా ఇంగ్లాండ్‌ లయన్స్‌తో రెండో అనధికార టెస్టులో భారత్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 163/4 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో కలిపి ప్రస్తుతం 184 పరుగుల ముందంజలో నిలిచింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (5) మరోసారి నిరాశపరిచాడు. కెఎల్‌ రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌లు రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అర్థ సెంచరీలతో నిలదొక్కుకున్న రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ మూడో సెషన్లో పెవిలియన్‌కు చేరుకున్నారు. కరుణ్‌ నాయర్‌ (15) రెండో ఇన్నింగ్స్‌లో అంచనాలను అందుకోలేదు. ధ్రువ్‌ జురెల్‌ (6 నాటాట్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. 33 ఓవర్లలో 4 వికెట్లకు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌-ఏ 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ లయన్స్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు, భారత పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌ (4/70), అన్షుల్‌ (2/56), తుషార్‌ దేశ్‌పాండే (2/62) విజృంభించారు. ఇంగ్లాండ్‌ లయన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూల్చారు. ఓపెనర్‌ టామ్‌ హేన్స్‌ (54), ఎమిలియో (71) సహా జోర్డాన్‌ (45), జోశ్‌ టాంగ్‌ (36 నాటౌట్‌) రాణించటంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ లయన్స్‌ 300 పరుగుల మార్క్‌ దాటింది. భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌-ఏ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ అనధికార టెస్టులో నేడు ఆఖరు రోజు ఆట.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img