Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఅగ్రస్థానంలోనే అభిషేక్‌

అగ్రస్థానంలోనే అభిషేక్‌

- Advertisement -

ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. టి20 బ్యాటర్ల జాబితాలో అభిషేక్‌ శర్మ తన అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. హైదరాబాద్‌కే చెందిన మరో బ్యాటర్‌ తిలక్‌ వర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్‌ శర్మ(829పాయింట్లు) టాప్‌లో కొనసాగుతుండగా.. తిలక్‌ వర్మ(804) ఆ తర్వాత స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(739) 6వ స్థానంలో నిలిచాడు. దీంతో టాప్‌-10లో భారత్‌కు చెందిన ముగ్గురు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్‌ సాల్ట్‌(791), బట్లర్‌(772)తో పాటు ఆస్ట్రేలియాకు హెడ్‌ 739పాయింట్లతో టాప్‌-5లో ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎడమ చేతివాటం పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ఒక ర్యాంక్‌ మెరుగుపరచుకున్న ఈ పంజాబీ స్పీడ్‌స్టర్‌ పదో స్థానం నిలిచాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన టి20 బౌలర్ల ర్యాంకిగ్స్‌లో అర్ష్‌దీప్‌తో కలిపి ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి నాలుగు, రవి బిష్ణోయ్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad