Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్లు అందజేత

ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్లు అందజేత

- Advertisement -

సెలవులు, పరీక్షల వివరాలు పొందిపర్చిన విద్యాశాఖ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఇక సులభతరం కానుంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి. ఏయే నెలలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలి.. సెలవు దినాలు.. తదితర వివరాల కోసం విద్యాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే మండలంలో 15 గ్రామాల పరిధిలో గల 32 ప్రభుత్వ పాఠశాలలకు, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలకు పంపిణీ చేశారు.

పనిదినాలు.. సెలవు రోజులు..

మండలంలో 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 2,ప్రాథమిక పాఠశాలలు 28 ఉన్నాయి.ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. ఇందులో 1388 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అకడమిక్ క్యాలెండర్లో నెలల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు.పాఠశాల పనిదినాలు, సెలవులను స్పష్టంగా పేర్కొన్నారు.క్యాలెండర్ ప్రకారం జూన్లో 15 రోజులు పనిదినాలు ఉండగా, జూలైలో 25 రోజులు, ఆగస్టులో 22 రోజులు, సెప్టెంబర్ 16 రోజులు, అక్టోబర్లో 22 రోజులు, నవంబర్లో 23 రోజులు, డిసెంబర్ లో 24 రోజులు, జనవరిలో 20,ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 22 రోజులు, ఏప్రిల్లో 18 రోజుల పనిదినాలు ఉన్నట్లుగా పేర్కొ న్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

పొందుపర్చిన ప్రధాన అంశాలు…

పరీక్షల షెడ్యూల్లో భాగంగా ఎస్ఏ-1 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల వరకు ఏఏ తేదీల్లో నిర్వహించాలో పొందుపర్చారు.సిలబస్ పంపిణీలో స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూ ల్స్,1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిల బస్ ఎప్పటి వరకు పూర్తి చేయాలి.రివిజన్, ప్ర త్యేక తరగతుల నిర్వహణ అంశాలు ఉన్నాయి.ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పనిచేసే సమయాలు పొందుపర్చారు.పాఠశాలల్లో ప్రతినెలా నిర్వహించే కార్యక్రమా లు సమావేశాలు, పాఠశాల స్థాయిలో నిర్వహిం చే ఆటల పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్స్పైర్ అవార్డులు, వంటి వివరాలను స్పష్టంగా పేర్కొని వాటిని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతీ పాఠశాలలో ఉండాలి: లక్ష్మన్ బాబు…మండల ఎంఈఓ

అన్ని వివరాలతో కూడిన అకడమిక్ క్యాలెండర్ ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి. విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్లను మండల  ఎమ్మార్సీ భవనం నుంచి పాఠశాలలకు చేరవేశాం. ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ సూచించిన వివరాల ప్రకారం పాఠశాలలు నిర్వహించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -