అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశం
విజన్ డాక్యుమెంట్ వార్‌రూమ్ సందర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకలప్పనకు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సందర్శించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనతోపాటు ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితర అంశాలను కూలంకుషంగా చర్చించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటుచేసిన ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, ప్రోగ్రాం, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ కమిటీల అధ్యక్షులు, సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయి సమీక్షించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రతి విభాగంలో పనిచేస్తున్న బృంద సభ్యులతో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడి పనులు జరుగుతున్న తీరును, వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్ రూమ్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి మంత్రులు సైతం వార్‌రూమ్‌ను సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు సవ్యసాచి ఘోష్, సంజరు కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, అజిత్ రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు శ్రీరామ్ కర్రీ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ సమ్మిట్ పనుల్లో వేగం పెంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



