నవతెలంగాణ – రాయపోల్ : రాయపోల్ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకారం అందించాలని నూతన ఎస్ఐ ఎస్సై మానస అన్నారు. సోమవారం ఆమె ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన విక్కర్తి రఘుపతి బదిలీపై గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్‌లో శిక్షణ ఎస్‌ఐగా విధులు నిర్వహించిన మానస నేడు రాయపోల్ ఎస్సైగా బదిలీపై వచ్చారు.
ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన మానసను వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకారం అందించాలని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా.. సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు అందరూ సహకరించాలన్నారు.
మండల పరిధిలోని పోలీస్ సిబ్బంది, అధికారులు, ప్రజలు అందరూ సమన్వయంతో మండలాన్ని నేరారహిత మండలంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామన్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో పోలీస్ సిబ్బంది గౌరవించి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
రాయపోల్ ఎస్సైగా మానస భాధ్యతల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES