Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయండంపింగ్‌ యార్డు పవర్‌ ప్రాజెక్టులో ప్రమాదం

డంపింగ్‌ యార్డు పవర్‌ ప్రాజెక్టులో ప్రమాదం

- Advertisement -

– లిఫ్ట్‌ పడటంతో ముగ్గురు కార్మికులు మృతి
– జవహర్‌నగర్‌లో ఘటన
నవతెలంగాణ-జవహర్‌నగర్‌

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు పవర్‌ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ తెగి కార్మికులపై పడటంతో ముగ్గు రు మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డంపింగ్‌ యార్డ్‌ పవర్‌ ప్రాజెక్టు పనుల్లో భాగంగా చిమ్ని అమరుస్తుండగా ఉదయం సుమారు 11 గంటల సమయంలో లిఫ్ట్‌ తెగిపోయి పనిచేస్తున్న కార్మికులపై పడింది. దాంతో కార్మికులు సురేష్‌ సర్కార్‌(21), ప్రకాశ్‌ మండల్‌(24), అమిత్‌ రారు(20) తీవ్రంగా గాయపడ్డారు. శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వారిని వెంటనే ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కార్మికులుగా గుర్తించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img