Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలు'ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌'లో ప్రమాదం

‘ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌’లో ప్రమాదం

- Advertisement -

స్టీం పైపు తగిలి ఒకరు మృతి
నవతెలంగాణ- యాదగిరిగుట్టరూరల్‌, భువనగిరి

యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గుట్ట రూరల్‌ ఎస్‌ఐ బి.భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన సదానందం(50) ఇరవై ఏండ్ల నుంచి ఆలేరు మండలం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున మొదటిషిప్ట్‌కు వచ్చిన ఆయన బాంబుల తయారీకి సంబంధించిన ప్రదేశంలో ఉండే భారీ స్టీం పైపు మూతను తీసేందుకు యత్నించాడు. దీంతో అది బలంగా వెనక్కి వచ్చి ముఖానికి తగలడంతో సదానందంకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నివాళులర్పించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భువనగిరి ఏరియాస్పత్రిలో సదానందం మృతదేహాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీమియర్‌ ఎక్స్‌ప్ల్లోజివ్‌ కంపెనీలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. కంపెనీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మిషనరీని పర్యవేక్షించి కొత్త టెక్నాలజీ మిషనరీ ఇంప్లిమెంట్‌ చేయాలని చెప్పారు. మృతిచెందిన కార్మికుని కుటుంబాన్ని కంపెనీ యజమాన్యం ఆదుకోవాలని కోరారు. ఈ ప్రమాదం పట్ల ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కందుకూరు మాజీ సర్పంచ్‌ బీమగాని రాములు, నాయకులు పెంటయ్య ఉన్నారు.

సీపీఐ(ఎం) నేతల సంతాపం
కార్మికుడు సదానందం మృతి పట్ల సీపీఐ(ఎం) నాయకులు, సీఐటీయూ నాయకులు సీహెచ్‌.రమేష్‌, జోగు శ్రీను, నరేష్‌, జమ్మూ, రాజశేఖర్‌, కాలే స్వామి సంతాపం తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img