నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆచార్య సూగూరు వెంకట (ఎస్వీ) రామారావు (84) హైదరాబాద్‌లోని ఓమ్నీ ఆస్పత్రిలో బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన ఉత్తమ సాహిత్య దార్శనికుడు. ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనా పర్యవేక్షకుడిగా మంచి పేరు సంపాదించారు. అతని పర్యవేక్షణలో 19 పీహెచ్‌డీ పరిశోధనలు, 15 ఎంఫిల్ పరిశోధనలు జరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా శ్రీరంగాపూర్ గ్రామంలో ఆయన 1941, జూన్ ఐదో తేదీన జన్మించారు. అక్కడే ప్రాథమిక పాఠశాల, వనపర్తిలో ఉన్నత పాఠశాల చదివారు. నిజాం కాలేజీలో పీయూసీ బీఏ చదివారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేశారు. డాక్టర్ సి నారాయణరెడ్డి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు అనే విషయంపై పరిశోధన చేసి 1973లో పీహెచ్‌డీ పట్టాను తీసుకున్నారు. 2001లో ఆయన ఉద్యోగ విరమణ పొందారు.
ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES