Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుకున్న లక్ష్యాలను సాధించాలి

అనుకున్న లక్ష్యాలను సాధించాలి

- Advertisement -

పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్..
నవతెలంగాణ – భువనగిరి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. గురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామి డిగ్రీ కళాశాలలో యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్ సంస్థ ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సృజనాత్మక యంగ్ లీడర్షిప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని అందులో నైపుణ్యం సాధించి విజయాలను సాధించాలన్నారు.

విద్యార్థులు డ్రగ్ రహిత భారత దేశంగా చేయడానికి కృషి చేయాలన్నారు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనరసయ్య, చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను కలిగి నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రమేష్ యూనిట్ వన్ టూ త్రీ  విభాగాధిపతులు  టి. రామకృష్ణ, కనక బాలరాజు అత్తర్ ఫరీన్. లెక్చరర్ డాక్టర్ బి జగన్నాథ్, డాక్టర్ ఎన్. సత్యనారాయణ, మారుతి, ఆర్  సిద్ధిరాములు, యు. రామకృష్ణ ఎని. సుధా, మొదలగు లెక్చరర్లు  విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -