నవతెలంగాణ-హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబాయి వేదికగా జరిగిన ఫైనల్ పోరులో దక్షణఫ్రికా టీంను 52 పరుగులతో తేడాతో ఇండియా చిత్తు చేసింది. దీంతో మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే విధంగా బుధవారం పీఎం ప్రధాని మోడీ టీం సభ్యులను ఆహ్వానించి అభినందించారు. తాజాగా భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉమెన్స్ టీంను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించి అభినందించారు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించారని కొనియాడారు.
అంతిమ పోరులో విజయం సాధించిన టీంతో ఉండటం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా విజయాన్ని భారతీయులు వేడుకగా జరుపుకుంటారని, జట్టు సభ్యులంతా ఇదే ఆటతీరతో దేశానికి కీర్తీ ప్రతిష్ట మరిన్ని తీసుకురావాలని తాను ఆశిస్తున్నానని భారత మహిళల క్రికెట్ జట్టుతో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. ఆ తర్వాత టీమిండియా జెర్సీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహుమతిగా టీం సభ్యులంత కలిసి అందజేశారు.



