Friday, January 9, 2026
E-PAPER
Homeకరీంనగర్దృఢ సంకల్పం, ఆరోగ్యమైన శరీరంతోనే లక్ష్యాల సాధన

దృఢ సంకల్పం, ఆరోగ్యమైన శరీరంతోనే లక్ష్యాల సాధన

- Advertisement -

డ్రగ్స్‌కు ‘నో’ చెప్పాలి.. మంచి అలవాట్లకు ‘ఎస్’ చెప్పాలి
– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
– రాయికల్ పోలీస్, ప్రెస్ క్లబ్ జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు
నవతెలంగాణ – రాయికల్

విద్యార్థులు, యువత మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నపుడే తమ లక్ష్యాలను సాధించగలరని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రాయికల్ పోలీస్ శాఖ,ప్రెస్ క్లబ్ (జేఏసీ)ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన మాదకద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “ఈ రోజు నేను ఒక అధికారిగా కాదు… మీ అందరికీ పెద్దన్నగా వచ్చాను”అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రానికి, దేశానికి దృఢ సంకల్పంతో పాటు ఆరోగ్యమైన శరీరం కలిగిన యువత అవసరమని పేర్కొన్నారు. గంజాయి, చరాస్, మద్యం వంటి దురలవాట్లు ఏకాగ్రతను కోల్పోయేలా చేసి జీవిత లక్ష్యాల సాధనకు అడ్డంకిగా మారుతాయని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ… యువత మంచి వ్యక్తులతో స్నేహం చేస్తూ.. బాధ్యతగల పౌరులుగా జీవన లక్ష్యాలను నిర్ధారించుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో డోపమిన్ ప్రభావంతో అలవాటుగా మారి శరీరం క్షీణించి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.

అగంతకులు ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, అనుమానం వచ్చిన వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్‌కు ‘నో’…మంచి అలవాట్లకు ‘ఎస్’ అని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో “మేము డ్రగ్స్ తీసుకోము. మా బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూసుకునే బాధ్యత మాదే. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వారికి అవగాహన కల్పిస్తాము”అని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుధీర్ రావు, గీత, కృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, ఎంఈవో రాఘవులు, ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి, సాయికుమార్, ప్రధాన కార్యదర్శి కె. జగదీశ్వర్, కోశాధికారి ఎం.శేఖర్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్‌, పాత్రికేయులు సింగిడి శంకర్, గుర్రాల వేణు, నాగమల్ల శ్రీకర్, రవి, రంజిత్, లింబాద్రి, మారుతి సంజీవ్, లక్ష్మణ్, కిరణ్ రావు, జితేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -