- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
కేరళ రాష్ట్ర అభివృద్ధికి అచ్యుతానందం చేసిన సేవలు మరువలేనివని, సిపిఐ ఎం మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతను రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని కొనియాడారు. కొత్త తరం నాయకులు అతని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండగుర్ల లింగన్న అంబటి లక్ష్మణ్ ఆత్రం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -