వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – కాజీపేట
నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ శివారులో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని హనుమకొండలోని ఒక ప్రముఖ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నది. రోజు మాదిరిగా కళాశాలకు వెళ్లి అమ్మమ్మ ఇల్లు వెంకటాపురానికి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చి కాపు కాసి ఉన్న దుండగులు ఆమెపై యాసిడ్ దాడికి ఒడిగట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మడికొండ సీఐ పుల్యాల కిషన్ వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈఘటన నగరంలో సంచలనం రేకెత్తిస్తోంది.
నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



