Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశాయ్ బీడీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

దేశాయ్ బీడీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
బీడీ కార్మికులను నిలువుగా దోపిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బీడీ కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తూర్పాటి శ్రీనివాస్ ఎండి నజీర్ లు అన్నారు. శనివారం మండల కేంద్రములో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది.

 ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ..కంపెనీ కార్మికులకు రూ. 10 తక్కువ చేసి ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. తినుబండారాలను అక్రమంగా అంటగడుతున్నారని తెలిపారు. 26 రోజులు పని దినాన్ని కల్పించి నాన్ పిఎఫ్ కార్మికులకు పిఎఫ్ నంబర్ ఇచ్చి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా నాయకులు మంజుల రిషిత కవిత మౌనిక అనూష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -