Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

కోకిల అజయ్ కుమార్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 

మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోకిల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను ఆపివేయాలంటూ తాహసిల్దార్ సృజన కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ..ఎస్సీ కమ్యూనిటీ హాల్  కోసం సర్వే నిర్వహించిన 18 గుంటల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

 మండల కేంద్రంలో  68 సర్వే నెంబర్ లక్నవరం శివారులో గల 18 గుంటల భూమి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొరకు సర్వే నిర్వహించిన భూమి  కొద్దికాలంగా అక్రమంగా ఫెన్సింగ్ లు వేస్తూ  నేడు అదే స్థలంలో  కొందరు వ్యక్తులు దేవుడి గుడిని సాకుగా చూపించి గతంలో పెట్టుకున్న హద్దులు మీరి సామాజిక న్యాయాన్ని మరిచి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, తక్షణమే ఆక్రమ కట్టడాలు నిలిపివేయాలని తాసిల్దార్ సృజన్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. 2021 లో ప్రభుత్వం సర్వే చేసిన 68 సర్వే నెంబర్లు భూమి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొరకు కేటాయించాలని గత కొద్ది సంవత్సరాలుగా దళిత బహుజన నాయకులు పోరాటాలు చేస్తున్నామని అయినప్పటికీ తాసిల్దార్ జిల్లా కలెక్టర్  అధికారికంగా స్థలం కేటాయించకపోవడంతో ఇటీవల కాలంలో జాతీయ ఎస్సీ కమిషన్  దరఖాస్తు  చేయడం జరిగిందన్నారు.ఇట్టి క్రమంలో సమస్య ఎస్సీ కమిషన్ పరిధిలో ఉండగానే స్థలం ఆక్రమించుకున్న వ్యక్తులు నేడు  అక్రమ కట్టడాలకు గొయ్యిలు తీయడం  జరుగుతుందని అలా అక్రమ కట్టడాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని తాసిల్దార్ ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ గొర్రెపాటి తరుణ్  అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు సంగి శివ, ప్రధాన కార్యదర్శి బొల్లం సభ్యులు కొత్తపల్లి వెంకటేష్,ఈర్ల ప్రసాద్,బొజ్జ రమేష్, ఇల్లందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -