ఎన్నికల కమిషన్‌కు జాగృతి అధ్యక్షురాలు కవిత ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరుఫున సీఎం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలో, డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన సభలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇకముందు నిర్వహించబోయే సభల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుతో పాటు వివిధ సభల్లో సీఎం మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్‌ను ఆమె జత చేశారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



