నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని సర్వే నెంబరు 259 లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పొలం చేసుకుంటున్నా వారి పైన, అనాజిపురం గ్రామంలోని ఏటి కాలువను ఆక్రమించుకున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అక్రమాన్నికి గురైన ప్రభుత్వ భూమిని, అనాజిపురం గ్రామంలోని ఏటి కాలువను పరిశీలన చేసిన అనంతరం భువనగిరి మండల తహశీల్దార్ అంజిరెడ్డి కి ప్రభుత్వ భూమిని, ఏటి కాలువను పరిరక్షించాలని, అక్రమ దారుల పైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ… ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని సర్వే నెంబరు 259 లోని ప్రభుత్వ భూమి గ్రామంలోని రైతులకు, వృత్తిదారులకు పశువుల, గొర్ల, మేకల మేతకు ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలోని మబ్బురాల గుట్ట దగ్గర ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉన్న పట్టా భూమిని ఒకతను కొనుగోలు చేసి ఆ భూమితో పాటు ప్రభుత్వ భూమిని కూడా తవ్వి పొలాలను అచ్చు కడుతున్నాడని, హద్దురాలను కూడా తొలగించారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రభుత్వ భూమికి హద్దురాళ్ళు నిర్ణయించి, అక్రమ దారులపై చర్య తీసుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. అనాజిపురం గ్రామంలో మొద్గుంపల్లి పాతకత్వ నుండి అనాజిపురం భోజకుంట, నందనము చెరువులోకి నీళ్లు రావడానికి ఉన్న ఏటి కాలువను కొంతమంది ఆక్రమించుకొని కాలువని పూడ్చినారని అన్నారు.
మరోవైపు నక్ష బాటలో కాలువ తూము నుండి రైతు పంట పొలాలకు నీళ్లు దగ్గర బోరు వేసి రైతులు తమ పొలాలకు పోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి ఉన్నదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆ కాలువను పరిశీలన చేసి ఆక్రమ దారుల నుంచి కాల్వ భూమిని తీసుకొని కాలువను వెడల్పు చేసి కాలువ ద్వారా సాగు నీళ్లను అందించాలని, అక్రమంగా వేసిన బోరును పూడ్చాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండ అశోక్, మండల నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, అనాజిపురం శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ ,రెండు గ్రామాలకు సంబంధించిన సీపీఐ(ఎం) నాయకులు, రైతులు కడారి కృష్ణ , ఎండి జహంగీర్, ఏదునూరి చంద్రయ్య, నీలం బిక్షపతి, గంగదారి వెంకటేష్, కొండ మహేష్, మెరుగు స్వామి, ఎలగల రాజయ్య లు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి, ఏటి కాలువను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES