సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు.
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలో నాణ్యతలేని మాంసాన్ని ఉగ్రహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మల్లేష్, శంకర్ నాయక్ లు మాట్లాడారు. మాంసము విక్రయం చేసే మార్కెట్లో విక్రయదారులు చనిపోయిన గొర్లను, మేకలను మార్కెట్లోకి తెచ్చి మోసం చేస్తూ అమ్ముతున్న విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
విచ్చలవిడిగా చనిపోయిన గొర్లను మేకలను, గొర్ల మేకల పాలు తాగే పిల్లల మాంసాన్ని అమ్ముతూ ప్రజలకు మోసం చేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మార్కెట్లో అమ్మే విక్రయదారుల విక్రయదారులు మార్పు రావడంలేదని అట్లాంటి వారి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేజీ మాంసం ధర రూ 900/- నుంచి రూ.1000/- రూపాయలకు అమ్ముతున్న నాణ్యతతో కూడిన మాంసాన్ని విక్రయించకపోవడంతో మాంసం తినే ప్రియులలో అసహనం వ్యక్తం అవుతుందన్నారు. అనేకసార్లు మార్కెట్లలో విక్రయదారులతో గొడవలు పడ్డటువంటి పరిస్థితులు ఉన్న అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నాణ్యతలేని మాంసం అమ్ముతున్నటువంటి వారి పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అట్లాంటి వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మార్కెట్ ఎప్పటికప్పుడు నకిలీ వస్తువులను నకిలీ మాంసాన్ని నాణ్యతలేని వస్తువులను అమ్మేటటువంటి అధికారులపై వినియోగదారులపై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఫిర్యాదు పై మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు రాములు, సయ్యద్ ,తారా సింగ్ తదితరులు ఉన్నారు.