డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
అటవీ భూముల్లో అనుమతి లేకుండా చర్యలు చేపడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్ హెచ్చరించారు. శనివారం మండలం లోని తాండూర్ గ్రామానికి చెందిన వడ్ల శివరాములు గ్రామ శివారులోని అటవీ భూమిలో పెద్ద రాయికి తెలుపు రంగు కలర్ వేసి ఓ మతానికి సంబంధించిన గుర్తులు వేశారు. దాని పక్కనే గుర్రం గద్దె నిర్మాణానికి భూమిపూజ చేసిన నేపథ్యంలో అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకొని పనులను నిలిపివేశారు. పెద్ద రాయి పై వేసిన గుర్తులను బ్లాక్ కలర్ వేసి చేరిపి వేశారు. అటవీ అధికారుల రాకను గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుండి వుడాయించాడు.
ఈ సందర్భంగా డిఆర్వో రవికుమార్ మాట్లాడుతూ .. అటవీశాఖ కు సంబంధించిన భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని తాండూర్ శివారులో చేపట్టిన పనులను నిలిపివేసి సంబంధిత వ్యక్తిని గట్టిగా హెచ్చరించామని తెలిపారు. గద్దె నిర్మాణానికి తీసుకువచ్చిన ఇసుకను, రాళ్లను స్వాధీనం చేసుకొని అక్కడి నుండి తరలించామని తెలిపారు. ఎవరైనా ఇలాంటి కట్టడాలు చేపట్టిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన వెంట బీట్ అధికారి ప్రవీణ్ గ్రామస్తులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై భార్గవ్ గౌడ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో అనవసరమైన గొడవలకు తావివ్వరాదని గ్రామంలో ఏమి జరిగిన తగిన చర్యలు తీసుకుంటామని సదరు వ్యక్తిని హెచ్చరించారు.
అటవీ భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES