Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు: కలెక్టర్

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు 
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో జనార్ధన్ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల డ్యూటీలు ఎవరు సక్రమంగా నిర్వహించకుంటే వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులను ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు బయటకు వదలకూడదని పోలీసుల ఆధీనంలో ఉంచాలని, ఎన్నికల అధికారులకు సూచించారు.

ఎన్నికలు సజావుగా సాగడానికి అధికారులు  సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులకు ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు  చూసుకోవాలని సూచించారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగిన పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని హెచ్చరించారు. మా అధికారులు నిర్వహణ కార్యక్రమంలో లోపాలు ఉన్నాయని వారి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -