- Advertisement -
– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బీటీ రోడ్లపై రైతులు ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు తాము పండించిన మక్కలు, వడ్లు, సోయబిన్ తదితర పంటలను రోడ్లపై ఆరబోస్తున్నారని, అంతేకాకుండా పంటకు అడ్డుగా రాళ్లను పెడుతున్నారని పేర్కొన్నారు. తద్వారా వీటిని గమనించకుండా ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై ఉన్నారని తెలిపారు. బీటీ రోడ్లపై ఎలాంటి ధాన్యం ఆరబోతలు చేయకూడదని, ఎవరైనా రోడ్లపై దాన్యం ఆరబోస్తే అట్టి వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
- Advertisement -