Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి 

కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి 

- Advertisement -

– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
నవతెలంగాణ -పెద్దవంగర: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జి గంజి విజయ్ పాల్ రెడ్డి అన్నారు. అవుతాపురం ఎంపీటీసీ క్లస్టర్ పరిధిలోని అవుతాపురం, ఉప్పెరగూడెం గ్రామాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు దుంపల ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ ఇద్దరు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో గ్రూపులను వీడి నాయకులు కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, మండల నాయకులు సీతారాం నాయక్, ఓరిగంటి సతీష్, దుంపల శ్యాం, తోటకూరి శ్రీనివాస్ బొమ్మరబోయిన రాజు, పొడిశెట్టి సైదులు, వేముల వెంకన్న, బీసు హరికృష్ణ, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, దుంపల రామానుజ మెట్టు నగేష్, బోనగిరి లింగమూర్తి, ఆవుల మహేష్, ముస్కు శోభన్, శ్రీరాం సాంబి, మహిళా నాయకులు కవిత, అశ్విని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad