నవతెలంగాణ – భువనగిరి
కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరణం దేశ రాజకీయ చరిత్రలో ఒక మరపురాని దిగ్భంతిని గురిచేసిందని ఆదర్శమూర్తిగా అచ్యుతానందన్ వెలిగారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు తొలిదశ నాయకునిగా, కార్మిక వర్గ దృక్పథంతో కార్మిక పక్షపాతిగా పేద వర్గం నుండి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారన్నారు. కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఉండి అనేక ఆటుపోట్లను ఎదురుదాడులను ఎదుర్కొని పార్టీని కాపాడడంలో కీలక పాత్ర పోషించారని వారు అన్నారు.
నేటి తరం కమ్యూనిస్టులకు అచ్యుతానందన్ ఆదర్శమూర్తిగా ఉన్నారని వారి ఆశయాల కోసం నేటితరం యువత ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. దేశంలో మతోన్మాదం అనేకరకాలుగా దాడి చేస్తున్న ఇలాంటి పరిస్థితులలో అచ్చుతానందం లాంటి గొప్ప నాయకులు లేకపోవడం పార్టీకి నాయకత్వానికి తీరని లోటు అన్నారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, గడ్డం వెంకటేష్, నాయకులు పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి, బందెల ఎల్లయ్య, వనం రాజు, వల్లబుదాసు రాంబాబు, గడ్డం వాణి పాల్గొన్నారు.