నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఖరీఫ్ 2025-26 సీజన్ విషయమై గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు (పౌరసరఫరాలు) పౌరసరఫరాల కమిషనరు వారిచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యంకు వెంటనే ఓ పి ఎమ్ ఎస్ యందు ట్యాబ్ ఎంట్రీ చేయించి,మిల్లర్ అక్నౌలెడ్జిమెంట్ ఇప్పించవలసినదిగా కోరారు. రైతులకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు చేయుటకు అవకాశం ఉంటుందని, రబీ 2024-25 సీఎంఆర్ డెలివరీ విషయమై రోజువారీ టార్గెట్ ఏర్పాటు చేసుకుని, మిల్లుల వద్దనుండి సి ఎం ఆర్ పొందువిధముగా చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు హరికృష్ణ, రోజారాణి, డిఆర్డిఓ నాగిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఖరీఫ్ సీజన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



