Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

ఆలేరులో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

- Advertisement -

శారాజిపేట్ పి హెచ్ సి,ప్రాథమిక పాఠశాల,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
నవతెలంగాణ – ఆలేర్ రూరల్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలను అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు ఓపీ, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ గదులను పరిశీలించారు.

అనంతరం ఆస్పత్రిలో విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును పరిశీలించి, ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. రోగులతో ప్రత్యక్షంగా మట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా?మందులు ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో అక్షరాలు పదాలు చదివించారు. విద్యాభివృద్ధికి కృషి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. వారి వెంట ఎంపీడీఓ,ఎంపీఓ, సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -