- Advertisement -
– మంత్రి పియూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లోని డీప్ టెక్ స్టార్టప్‌లు, పరిశోధనలకు రూ.10,000 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇది రూ.1 లక్ష కోట్ల పరిశోధన అభివృద్ధి, ఆవిష్కరణ పథకంలో భాగమన్నారు. ఇందులో రూ.20,000 కోట్లు ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించబడ్డాయి. ఈ నిధులు కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఆవిష్కరణలకు ఉపయోగపడతాయన్నారు. ఇందులో భాగంగా 100 డీప్ టెక్ స్టార్టప్‌లను గుర్తించి ప్రోత్సహిస్తారు.
- Advertisement -