- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల పోలీస్ స్టేషన్ ను భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలిస్ స్టేషన్ లో గల రికార్డు లను పరిశీలించి, పలు వివరాలను సిఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్ లను అడిగి తెలుసుకున్నారు. కేసులు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో నేరస్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈ సందర్బంగా ఆయన ఆదేశించారు.
- Advertisement -



