యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు
మోతాదుకు మించి యూరియా వాడవద్దు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం తోపాటు ముస్తాబాద్ లో కొంతమంది రాజకీయాల కోసం రైతు లని రెచ్చగొడుతూ ధర్నాలు చేపిస్తున్నారని, జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందిస్తామని అన్నారు.
ఈ సీజన్ మొత్తానికి 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మేరకు జిల్లాకు ఈ రోజు వరకు 12 వేల 500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఇంకా జిల్లా రైతులకు కావాల్సిన 11 వేల 500 మెట్రిక్ టన్నుల యూరియా విడతల వారీగా అందుబాటు లోకి తీసుకువస్తామని, రైతులెవరు ఆందోళన చెందవద్దని విడతల వారీగా ఈ సీజన్ వరకు అందరికి అందచేస్తామని అన్నారు.
రైతులు కూడా అవసరానికి మించి, యూరియా వాడవద్దని, మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల, పంటకు, చీడ పీడకు అధికంగా అశిస్తాయని, నేల ఆరోగ్యం క్షీణిస్తుందని అన్నారు. కావున రైతన్నలందరు, యూరియా వాడకన్ని తగ్గించాలని, యూరియా గ్రాన్యూల్స్ కి బదులుగా, నానో యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు.
సాగుకు సరిపడా యూరియా నిల్వలు: ఏఓ అఫ్జల్ బేగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES