గ్రామాల్లో సాయంత్రం కాగానే చావిడి దగ్గర కాని, బొడ్రాయి దగ్గరనో, రావి – వేప చెట్టు గద్దె వేసిన వాటి దగ్గర నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఊరిలోని విషయాలను కలబోసుకుంటుంటారు. అలాంటి ముచ్చట్లు మనకు ఆకాశవాణి (రేడియోలో) ప్రసారం చేసి ప్రజలకు అవగాహన కలిపించేవారు.
డాక్టర్ ఉదారి నారాయణ గారు ”యాపచెట్టు కాడ” శీర్షికన మా ఊరి ముచ్చట్లు వాటిలో సామాజిక, రాజకీయ విషయాలపై వ్యంగ్య కథనాలు ఒక 27 అంటే నక్షత్రమాలను మన ముందుకు తీసుకువచ్చి చైతన్య పరిచే ప్రయత్నం చేసారు. ఈ ముచ్చట్లు అన్నీ ఆదిలాబాద్ మాండలికంలో చెప్పారు. ఆదిలాబాద్ గ్రామీణ జీవద్భాషలో పరిచయం చేయడం వలన అక్కడి యదార్థత మనకు కనిపిస్తుంది. ఆ భాష నుడికారం మీరూ చూడండి.
”గెల్సినంక ఆల్లు బర్రె తీరు లీల్లల్ల సల్లగుంటలు. మనం కొమ్ముల తీరు ఎండలుండవల్తది. ఏం బట్టిచ్చుకోరు. మా బొప్పడైతే లోను కోసం తిర్గితిర్గి శెప్పులరుగ్గొట్టుకుని ఆన్నె ఇడ్సివెట్టచ్చిండు. ఇంకా మీదటికెల్లి ఆ లీడర్ ఏమండటా! మందంత నా శాతి మీద ఉన్నట్టే ఉంటలు. నన్ను మాడనియ్యలు, సూడనియ్యలు అంటడట” పుట – 40
”గట్ల కొత్తలు దీస్కొని, కల్లుదాగి ఓటేసేటోల్లని ఇంట్లకే రానియ్యద్దని కరాకండిగ జెప్పింది” పుట – 43
”కైకిలి జేసేటోల్లకైతే మస్త్ ముష్కిలైంది. పనిజేత్తనే కొత్తలు పాపం, కొందరైతే ఉత్త శాయమీన్నే దినం దీస్తున్నలని గరీబోల్లని” – పుట 73
ఈ ముచ్చట్లు కేవలం ఉబుసుపోకవి కాదు. జనజీవనంలోని నిత్యసత్యాలు. వారు అనుభవించిన చేదునిజాలు. ఈ ముచ్చట్లు ఎలక్షన్స్, వలసజీవన చిత్రాలు, కల్తీవిత్తనాలు, గ్రామీణ జీవన విధానం మనకు చాటి చెబుతూనే జీవనములోని వైవిధ్యభరితమును మనముందుచతవి. సామల సదాశివ రచనలలో ఆదిలాబాద్ ప్రాంతం జీవనాన్ని కొద్దిగా పరిచయం చేస్తే, నారాయణ గారు పూర్తిగా ఆ ప్రాంత మాండలికమును మనముందుంచారు. మాండలిక భాషాభిమానులు ఒకపరి చదవాలి. ఉదారి నారాయణ గారికి అభినందనలు.
– డా.టి. శ్రీరంగస్వామి, 99498 57955
ఆదిలాబాద్ మాండలికం
- Advertisement -
- Advertisement -