- Advertisement -
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న బాధతో మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన రిత్విక్ (17) ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా అందులో ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దింతో మనస్తాపానికి గురై ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తండ్రి భూమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
- Advertisement -