Wednesday, July 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్చెస్ లో ఆదిలాబాద్ అక్కాచెల్లెళ్ళ సత్తా

చెస్ లో ఆదిలాబాద్ అక్కాచెల్లెళ్ళ సత్తా

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన సారంగపాణి- అర్చన దంపతుల కుమార్తెలు అంబటి అద్విత, సుకీర్తి అక్కచెల్లెళ్ళు చెస్ ఆటలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఇన్విటేషన్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీలో బెస్ట్ ఆఫ్ ఫైవ్ లో విజేతగా నిలిచి పతకాలు సొంతం చేసుకున్నారు. అసోసియేషన్, ఎసీజీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ప్రపంచ క్రీడాకారిణులుగా పేరు తెచ్చుకోవడమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. ఖాళీ సమయాల్లో, సెలవుల్లో తల్లిదండ్రులతో కలిసి చెస్ ఆడుతూ తమ ప్రతిభను మెరుగు పరుచుకుంటు ఉంటారు. పథకాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో బంధు, మిత్రులు అక్కచెల్లెళ్ళను అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -