నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కి ఆదిలాబాద్ ఎస్ఆర్ పాటశాల విద్యార్థుల ఎంపికయ్యారు. ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 10వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల కోసం ఆన్లైన్ కోర్సులు అందించబడ్డాయని ఎస్ఆర్ జోనల్ ఇంఛార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 3,750కి పైగా పాఠశాలలు, 70 వేలకు పైగా విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారని పేర్కొన్నారు. జిల్లా నుండి ఒకే ఒక్క పాఠశాలగా ఎస్ఆర్ పాఠశాల ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. పాఠశాల నుండి 10వ తరగతికి చెందిన పీ.వంశీ, ఎస్. లక్ష్మీ నరసింహ, డి. సాయి చరణ్, జె. సంతోష్ రాజు, షేక్ రేహాన్, ఏ. బాలాజీ, టి. అజయ్, బీ. నవనీత్ 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు.
ఈ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ ద్వారా 8 వారాల పాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించబడతాయని ప్రతి సోమవారం, శనివారం తరగతుల కోసం లింకులు విద్యార్థులకు షేర్ చేయబడతాయని వివరించారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ అందించే కోర్సులపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఒక్కో కోర్సుకు కేవలం రూ.500 మాత్రమే ఫీజుగా నిర్ణయించరని అన్నారు. ఎంపికైన నేపథ్యంలో మంగళవారం పాఠశాలలో వారిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవిదాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రమోద్, ఎంపికైన విద్యార్థుల ఇంచార్జ్ టీచర్‌గా శ్రీ సతీష్ రెడ్డి ఉన్నారు.
ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకి ఆదిలాబాద్ ఎస్ఆర్ విద్యార్థులు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES