Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంకొండచరియలు విరిగిపడి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి మృతి

కొండచరియలు విరిగిపడి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూకాశ్మీర్‌లో రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రాజిందర్ సింగ్ రాణా తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.

రియాసి జిల్లాలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌గా రాజిందర్ సింగ్ రాణా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ధర్మరి నుంచి తన స్వస్థలమైన పట్టియాన్‌కు వెళుతుండగా సలుఖ్ ఇఖ్తర్ నల్లా ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియల భాగంలో ఒక పెద్ద బండరాయి వాహనంపై పడింది. దీంతో కారులో ఉన్న రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -