– కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి : కమిషనర్ ఆర్ వి కర్ణన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జలగం వెంగళరావు పార్కులో ఏర్పాటు చేసిన ‘ఇండీ పప్పీ దత్తత మేళా’ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఆర్‌వి కర్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ‘బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్’ అనే నినాదంతో ఆకట్టుకుంది. డీ-వార్మ్ చేసిన, వ్యాక్సిన్ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రేమికులు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. తొలి దత్తతగా కూకట్‌పల్లికి చెందిన సీహెచ్ సాయికి ఒక కుక్కపిల్లను కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరిచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
దేశీ కుక్కపిల్లలు దత్తత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES