- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో ఉన్న బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో శనివారం పాఠశాల కరస్పాండెంట్ వాల శశిధర్ రావు ఆదేశాల మేరకు చిన్నారులు, ఉపాధ్యాయులు అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు అమ్మవారి వేషధారణలో ఆషాడ మాస బోనాల జాతర వేడుకలు నిర్వహించారు. బాలికలు శివసత్తుల రూపంలో నృత్యాలు చేసి పలువురిని ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -