- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల విద్యుత్ ఇంచార్జ్ ఏ ఈ వెంకటేశ్వర్లు రూ.15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబాడారు. వెల్దండ మండల కేంద్ర పరిధిలోని చొక్కన్న పల్లి గ్రామ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మ్ కోసం ఏ ఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా.. 15వేలు ఒప్పుకొని నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
- Advertisement -



