Monday, March 30, 2026
E-PAPER
Homeఆటలుఎన్నాళ్లకెన్నాళ్లకు

ఎన్నాళ్లకెన్నాళ్లకు

- Advertisement -

– 14 ఏండ్ల తర్వాత తొలి పోరులో ముంబై గెలుపు
– కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం
– రోహిత్‌, రికల్టన్‌ విజృంభణ

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కొత్త చరిత్ర లిఖించింది. 2012 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడుతూ వస్తున్న ముంబై..ఈసారి ఆ రికార్డును తిరుగరాసింది. తద్వారా వరుసగా 13 ఓటముల పరంపరకు ముగింపు పలికింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(38 బంతుల్లో 78, 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), రికల్టన్‌(43 బంతుల్లో 81, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో దుమ్మురేపారు. వీరిద్దరు పసలేని కోల్‌కతా బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ బౌండరీలతో చెలరేగారు. వీరిద్దరి విజృంభణతో తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆరోరా, త్యాగి, నరైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు కెప్టెన్‌ రహానే(40 బంతుల్లో 67, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), రఘువంశీ(29 బంతుల్లో 51, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 220/4 స్కోరు చేసింది. శార్దుల్‌ ఠాకూర్‌(3/39) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -