వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు బాపిరాజు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ,’నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో ‘బంగారు పాదం’ అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి.
మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్‌గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. మా చిత్రాన్ని పొయెటిక్‌గా రూపొందించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది’ అని తెలిపారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ,’మనం బయట సమాజంలోని మగాళ్లను శిక్షిస్తున్నాం. కానీ మన కుటుంబాల్లో, ఇంటిలో ఉండే మగాళ్లను శిక్షించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఇదే ఇతివృత్తంతో మంచి సందేశం, వినోదం ఉండేలా ఈ సినిమాను రూపొందించారు ప్రసాద్’ అని అన్నారు.
ఇంటి మృగాళ్ళ నేపథ్యంలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



