Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ హార్టికల్చల్‌ యూనివర్సిటీ, బిస్లరీ మధ్య ఒప్పందం

తెలంగాణ హార్టికల్చల్‌ యూనివర్సిటీ, బిస్లరీ మధ్య ఒప్పందం

- Advertisement -

– ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసే ప్రక్రియ
– ప్లాస్టిక్‌ రహిత విశ్వవిద్యాలయంగా ఉండటమే లక్ష్యం : ఉపకులపతి డాక్టర్‌ దండ రాజ రెడ్డి
నవతెలంగాణ-ములుగు

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చల్‌ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ) సిద్దిపేట జిల్లా ములుగులోని బిస్లరీ ఇంటర్నేషనల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థల మధ్య జరిగిన కీలకమైన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘బాటిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ భాగస్వామ్యం కుదిరింది. అందులో భాగంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులు, సిబ్బందిలో సామాజిక స్పృహను పెంపొందించడం, ప్లాస్టిక్‌ను బాధ్యతాయుతంగా పారవేసి రీసైక్లింగ్‌ చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల నిర్వహణ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ దండ రాజరెడ్డి మాట్లాడుతూ.. ‘బాటిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమం ప్లాస్టిక్‌ను కేవలం వ్యర్థంగా కాకుండా, రీసైక్లింగ్‌కు ఉపయోగపడే విలువైన వనరుగా గుర్తించాలన్నారు. ఈ ఒప్పందం కింద యూనివర్సిటీ ఉపయోగించిన ప్లాస్టిక్‌ను ప్రాంగణం నుంచే వేరు చేసి, శుభ్రంగా రీసైక్లింగ్‌కు పంపడం జరుగుతుందన్నారు. తద్వారా ప్లాస్టిక్‌ పారవేసే అలవాట్లలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందని తెలిపారు. బిస్లరీ సంస్థ తమ వంతు బాధ్యతగా, ప్రాంగణంలోని విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, హౌస్‌ కీపింగ్‌ సిబ్బందికి ప్లాస్టిక్‌ నిర్వహణపై తగిన శిక్షణను అందిస్తుందన్నారు. అలాగే, సేకరించిన ప్లాస్టిక్‌ మొత్తాన్ని తమ అధీకృత రీసైక్లింగ్‌ భాగస్వాముల ద్వారా నేరుగా రీసైక్లింగ్‌ కేంద్రాలకు చేరేలా చూస్తుందని తెలిపారు. సేకరించిన ప్లాస్టిక్‌ వివరాలను, వాటిపై సర్టిఫికెట్లను యూనివర్సిటీకి అందజేస్తుందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా క్యాంపస్‌లో పర్యావరణ పరిరక్షణకు, స్థిరమైన వ్యర్థాల నిర్వహణకు బలమైన పునాది పడినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ. భగవాన్‌, బిస్లరీ ఇంటర్నేషనల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కె.గణేష్‌, డీన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌. జె.చీనా నాయక్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌. డి. లక్ష్మీనారాయణ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్టెన్షన్‌, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌, ఆఫీసర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ విజయ, డాక్టర్‌ జి. సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -