- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
మండలంలోని రైతుల కోసం రాయితీపై వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయని స్థానిక వ్యవసాయ అధికారి సంగీత తెలిపారు. బ్యాటరీ, పవర్ స్ప్రేయర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, కేజీ వీల్స్ వంటి పరికరాలను రాయితీపై అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు సెప్టెంబర్ 13 లోపు తమ దరఖాస్తులను రైతు వేదికలలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -