Tuesday, October 28, 2025
E-PAPER
Homeఖమ్మంవరి, పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

వరి, పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండల పరిధిలోని గుట్ట మల్లారం గ్రామంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు మరియు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ విజయలక్ష్మి పండిట్ మరియు ఏఎస్ఓ రాజేష్ మరియు గ్రామ రైతులతో కలిసి మరియు వరి, ప్రత్తి పంటలలో పంట కోత ప్రయోగాలను చేయుటకు క్షేత్రాలను మంగళవారం సందర్శించినారు. వానాకాలం 2025-26 సంవత్సరానికి గాను గుట్ట మల్లారం గ్రామంలో వరి మరియు ప్రతి పంటలు పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. ఈ పంట కోత ప్రయోగాల వలన గ్రామంలో,మండలంలో,జిల్లా మరియు రాష్ట్రాల్లో వచ్చే సరాసరి పంట దిగుబడులను అంచనా వేయడం జరుగుతుందని ఈ అంచనాల ద్వారానే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు కొనుగోలు, ఎరువుల అవసరం,విత్తనాల అవసరం తదితరాలను అంచనా వేసుకుంటాయని తెలిపారు. అదేవిధంగా దేశ జిడిపి అంచనా వేయుటకు కూడా ఈ పంట కోత ప్రయోగాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు కొమరం మధు, కారం రమేష్ తదితర వరి మరియు పత్తి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -