Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ శాస్త్రవేత్తలు దేశ సంపద

వ్యవసాయ శాస్త్రవేత్తలు దేశ సంపద

- Advertisement -

– డీఆర్డీఓ మాజీ డైరెక్టర్‌, మిస్సైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారీ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

వ్యవసాయ శాస్త్రవేత్తలు దేశానికి గొప్ప సంపదని డీఆర్డీఓ మాజీ డైరెక్టర్‌, మిస్సైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారీ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నారం)లో జరిగిన 115వ ఫౌండేషన్‌ కోర్సు ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధన సంస్థల్లో ఒకటిగా ఐసీఏఆర్‌ నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయిని హైలెట్‌ చేస్తూ శిక్షణలో పాల్గొనేవారు తమ వృత్తిపరమైన ప్రయాణంలో ఆవిష్కరణ, పట్టుదలను స్వీకరించాలని సూచించారు. కష్టపడి పనిచేయాలని, విస్తృత దృక్పథాన్ని అవలంబించాలని అన్నారు. ఉత్సాహం, దృఢ సంకల్పంతో వారి కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని తెలిపారు. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వివిధ రకాల నూతన ఆవిష్కరణల గురించి నిత్యం పరిశోధనలు చేయాలని అన్నారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ సభ్యులు డాక్టర్‌ చబిలేంద్ర రౌల్‌ మాట్లాడుతూ.. 1960ల్లో ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి, ఆహార భద్రత సాధించే వరకు భారతదేశ ప్రయాణాన్ని వివరించారు. పోషకాహార భద్రత, వాతావరణ మార్పు ప్రభావాలను పరిష్కరించేటప్పుడు నాణ్యత, మెరుగుదల, సహజ వనరులను పరిరక్షించడం, యాంత్రీకరణ, సామాజిక-ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోవడం వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు, సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనాలను అందించే ప్రాథమిక, అనువర్తిత పరిశోధనలను కొనసాగించాలని ప్రొబేషనరీ శాస్త్రవేత్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జోరు, నారం డైరెక్టర్‌ డాక్టర్‌ గోపాల్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -