Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా రైతులకు రాయితీలో వ్యవసాయ పనిముట్లు: ఏఓ శ్రీజ

మహిళా రైతులకు రాయితీలో వ్యవసాయ పనిముట్లు: ఏఓ శ్రీజ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
వ్యవసాయ యాంత్రీకరణ పథకం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్)లో భాగంగా మహిళ రైతులకు 2025-26 మండలానికి 50శాతం రాయితీతో మొత్తం 131 పనిముట్లు కేటాయించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.రోటవే టర్స్ -5,కల్టివేటర్/ కేజీ వీల్స్/డిస్క్ హార్రో -7,బ్యాటరీ స్ప్రేయర్స్ – 90,పవర్ ఆపరేటర్స్ స్ప్రేయర్స్ – 22,బ్రష్ కట్టర్- 2,వరి గట్లు వేసే మెషిన్ -1,విత్తనం.అలాగే ఎరువులు వేసే మెషిన్ – 1,పవర్ టిల్లర్ – 1,వరి గడ్డి కట్టే మెషిన్ – 2,భూమి కలిగిన మహిళా రైతులు అప్లికేషన్ ఫామ్ తో,ఆధార్ కార్డు,పట్టా పాస్ బుక్ జిరాక్స్,ట్రాక్టర్ కి సంబంధించిన వస్తువు కొనుగోలుకు ట్రాక్టర్ ఆర్సి డీటెయిల్స్ ,పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంబంధిత పత్రాలు జత చేసి  మండల వ్యవసాయ అధికారి కార్యాలయం కొయ్యూరు లేదా తాడిచర్లలో ఇవ్వాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -