Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత 

కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత 

- Advertisement -

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 
నవతెలంగాణ – పరకాల 
: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం పై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు మారాలన్నారు.

తరతరాలుగా వస్తున్న సంస్కృతి వ్యవసాయం అని, దేశ వ్యవసాయ రంగం ప్రపంచానికే అగ్రస్థానమన్నారు. ప్రపంచ మార్కెట్లో పోటీపడి రైతులు పంటలు పండించినప్పుడే దేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుందని, రైతులు గౌరవంగా జీవించగలుగుతారన్నారు. పిఎసిఎస్ లో వ్యాపార దృక్పథం పోయి రైతు శ్రేయస్సుకు పనిచేసినప్పుడే రైతులు అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారన్నారు. సేంద్రీయ పంట వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మండలానికి 125 మంది రైతులు ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ఆదాయం 34% రైతుల నుండే వస్తుందని, రైతుల ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగా అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేత…

క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పరకాల పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం సూచించిన లబ్ధిదారులు నిబంధనల మేరకు గృహ నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -