Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది ప్రధానపాత్ర

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది ప్రధానపాత్ర

- Advertisement -

యువ పట్టభద్రులు రైతులకు సేవలందించాలి : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
ఘనంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం
నవతెలంగాణ- రాజేంద్రనగర్‌

యువతకు, మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు పేదరికాన్ని రూపుమాపి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయానిది ప్రధాన పాత్ర అని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చెప్పారు. అగ్రికల్చర్‌ కోర్సుల్లో పట్టభద్రులైన యువత రైతులకు నిరంతర సేవలందిస్తూ సాగుని లాభసాటిగా చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవ సాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో శనివారం ఘనంగా జరిగింది. 2021-2022 మధ్య ఉత్తీర్ణులైన 844 మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థు లకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. 1965లో నాటి ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జాతికి అంకితం చేసిన ఈ వ్యవసాయ విశ్వవిద్యాల యం బహుముఖాలుగా విస్తరించడం చాలా గర్వకారణ మన్నారు. వ్యవ సాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల ను అధిగమించేందుకు విశ్వవిద్యాలయం పనిచేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తోందన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్‌లో దేశంలో తొలి పది స్థానాల్లో విశ్వవిద్యాలయంనిలువ నుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’, ‘ప్రతి గ్రామానికీ నాణ్యమైన విత్తనాలు’ కార్యక్రమాలతో రైతాంగా నికి చాలా మేలు జరిగిందని వివరించారు. వాతావరణ మార్పులు, మార్కెటింగ్‌ తదితర సవాళ్లకు అనుగుణంగా శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాలు చూపించాలన్నారు.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రి కల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ మంగీలాల్‌ జాట్‌ స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన ఎందరో వ్యక్తులు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో ఉండి దేశానికి, రైతాంగానికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఒకనాడు ఆహార కొరత ఎదుర్కొన్న దేశం.. నేడు ఆహార ధాన్యాల మిగులు స్థాయికి చేరుకుందని అన్నారు. అందుకు శాస్త్ర విజ్ఞానం, ప్రభుత్వాల విధానాలు, రైతుల నిరంతర శ్రమనే దోహదం చేశాయన్నారు. భూగర్భజలాల క్షీణత, భూసార క్షీణత, పర్యావరణ విధ్వంసం, పర్యావరణ మార్పులు వంటి సవాళ్లను నేడు మనం ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌గా రూపాంతరం చెందటానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ, ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య వార్షిక నివేదికను సమర్పించారు. అత్యుత్తమ ప్రతిభగల కనపరిచిన 20 మంది విద్యార్థులకు 30 బంగారు పతకాలు అందజేశారు. కంది అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని భార్గవి అత్యధిక ఓజీపీఏ సాధించినందుకు 6 బంగారు పతకాలు, వరంగల్‌ వ్యవసాయ కళాశాల విద్యార్థిని అర్షియా తబస్యుమ్‌ బీఎస్సీ అగ్రికల్చర్‌లో అత్యధిక ఓజీపీఏ సాధించినందుకు నాలుగు బంగారు పతకాలు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, విశ్వవిద్యాలయ అధికారులు, పూర్వ ఉపకులపతులు, రిజిస్ట్రార్‌లు, వివిధ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -