నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన ప్రాథమిక నివేదిక ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తో పాటు.. సంబంధిత అధికారులకు సమర్పించింది. జూన్ 12న ఈ ప్రమాదం చోటు చేసుకోగా జులై 11న లోపు నివేదిక ఇవ్వాలని AAIB కేంద్రం గడువు విధించింది. ఈ క్రమంలో ఈ రోజు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తమ నివేదికను అందించింది. అయితే ఇది దర్యాప్తు యొక్క ప్రాథమిక ఫలితాల ఆధారంగా దాఖలు చేసిన నివేదికగా తెలుస్తుంది. గుజురాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం..ప్రాథమిక నివేదిక అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES