Tuesday, August 5, 2025
E-PAPER
Homeనిజామాబాద్ఆలూరులో ప్రభాత్ ర్యాలీ లో పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్,,   జిల్లా  ఇన్చార్జి మంత్రి 

ఆలూరులో ప్రభాత్ ర్యాలీ లో పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్,,   జిల్లా  ఇన్చార్జి మంత్రి 

- Advertisement -

నవతెలంగాణ   ఆర్మూర్ 

 నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రభాత్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు  జై భీమ్, జై భారత్, జై సమ్మిదాన్ లపై కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. మండల కేంద్రంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పలు ఏరియాల్లో చెత్తా,చెదారాలను పిచ్చి మొక్కలను పరిశుభ్రం చేశారు. తర్వాత వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి మీనాక్షి నటరాజన్ నీళ్లు పోశారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి,బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సునీల్ రెడ్డి, బాన్సువాడ ఇన్‌చార్జ్ ఏనుగు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, మనా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత సంపత్, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రీ అనిల్, మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, ఆర్మూర్ అధ్యక్షుడు చేపూర్ సురకంటి చిన్నారెడ్డి, వైస్ మల్లారెడ్డి, డీసీసీబి జనరల్ సెక్రటరీ డేగ పోశెట్టి, చిట్టి రెడ్డి భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -