Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఐటీయూలో ఏఐసీసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరిక

సీఐటీయూలో ఏఐసీసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరిక

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొయ్యల రాజు సీఐటీయూలో చేరారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమక్షంలో ఆయన సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో సీఐటీయూ కార్మికవర్గ ఐక్యత కోసం కృషి చేస్తున్నదనీ, వారి పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆ సంఘం చేస్తున్న పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని భావిస్తూ ఏఐసీసీటీయూకి రాజీనామా చేసి, సీఐటీయూలో చేరుతున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో కార్మికుల సమస్యలపై జరిగే సమరశీల పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు. సీఐటీయూలోకి ఆహ్వానించిన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎన్‌. వీరయ్య, భూపాల్‌, పద్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏఐసీసీటీయూకి ఉన్న కమిటీలను త్వరలో సీఐటీయూలో విలీనం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -