Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం6,7 తేదీల్లో ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ మహాసభలు

6,7 తేదీల్లో ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ మహాసభలు

- Advertisement -

– రాష్ట్రం నుంచి రామేశ్వరానికి 20 మంది ప్రతినిధులు :
అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అఖిల భారత మత్స్యకారులు, మత్స్య కార్మికుల సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌) జాతీయ మహాసభలు ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరుగబోతున్నాయనీ, తెలంగాణ నుంచి 20 మంది ప్రతినిధులు బయలు దేరారని ఆ సంఘం జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మత్స్య వృత్తి జీవనాధారంగా ఆరు కోట్ల మంది మత్స్యకారులు, మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. మత్స్య సంపద, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదాయంగా వస్తున్నదని వివరించారు. ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారి జీవనవిధానం మాత్రం అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత్స్యకారుల హక్కులను కాలరాస్తు న్నదనీ, వారికి లబ్దిచేకూర్చే సంక్షేమ పథకాలను ఎత్తేసిందని విమర్శించారు. వెంటనే ఆ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నాలుగో అఖిల భారత మత్స్యకారుల జాతీయ మహాసభల్లో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చనమొని శంకర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గొడుగు వెంకట్‌, ఎం.రమేష్‌, టి.ఇస్తారి మత్స్య మహిళా విభాగం రాష్ట్ర కో-కన్వీనర్‌ బక్కి బాలమణి, గాండ్ల అమరావతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -