ఆ తీగల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
మెట్రో జోన్ పరిధిలో 550 కిలోమీటర్ల ఎల్‌టీ ఓవర్ హెడ్ కండెక్టర్ల మార్పిడి : టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
మెట్రో జోన్ పరిధిలోని సబ్-ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లతో సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్తీలు, చిన్న చిన్న గల్లీల్లో ఇండ్లకు దగ్గరగా/తాకుతూ ప్రమాదకరంగా ఉన్న ఎల్‌టీ విద్యుత్ తీగల (ఓవర్ హెడ్ కండక్టర్) స్థానంలో ప్రత్యేక ఇన్సులేషన్ ఉన్న ఎయిర్ బంచ్డ్ కేబుల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎస్పీడీసీఎల్) చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. దీనికి సంబంధించి గత వారం మెట్రో జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లు బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ పరిధిలో నిర్వహించిన పోల్ టు పోల్ తనిఖీల్లో దాదాపు 550 కిలోమీటర్ల మేర ఎల్‌టీ ఓవర్ హెడ్ కండక్టర్ మార్చాల్సిందని నివేదికలో గుర్తించారు. దీన్ని మార్చడానికి కార్యాచరణ రూపొందించామని, గుర్తించిన ప్రదేశాల్లో ఈ నెలా ఖరు వరకు ఓహెచ్ కండక్టర్ స్థానంలో ఏబీ కేబుల్ అమర్చనున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర సర్కిళ్లలో కూడా ఈ సేవలు విస్తరిం చనున్నామని తెలిపారు. బుధవారం సంస్థ ప్రధాన కార్యాల యంలో మెట్రో జోన్ పరిధిలోని సుమారు 160 మంది సబ్-ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పై అసిస్టెంట్ ఇంజినీర్లతో ఆరా తీశారు. అనంతరం సీఎండీ మాట్లా డుతూ.. క్షేత్ర స్థాయిలో అసిస్టెంట్ ఇంజినీర్లు సంస్థకు టీం లీడర్ వంటి వార న్నారు. సమస్యల పరిష్కారం, సంస్థ పురోభివృద్ధిలో ఏఈలదే కీలక పాత్ర అని తెలిపారు. క్షేత్ర స్థాయి లోని వాస్తవ పరిస్థితులపై వారి సూచనలే నిరంతర విద్యుత్ సరఫరా అందిం చడంలో కీలక భూమిక వహిస్తాయన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్లు సమయ పాలన పాటిస్తూ వినియోగదారులకు అందుబా టులో ఉంటూ సంస్థకు మంచి పేరు తీసుకురా వాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డాక్టర్ నర్సింహులు, చక్రపాణి, ఎస్‌ఈ వేణుగోపాల్, మెట్రో జోన్ పరిధిలోని సబ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదకర విద్యుత్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES